సుమంత్‌ 25 వ చిత్రం లో తెలుగు అమ్మాయి

49
“ఏమో గుర్రం ఎగరవచ్చు” మూవీ తరువాత చాల గ్యాప్ తీసుకున్న సుమంత్ మళ్ళిరావా అనే మూవీ తో 2017లో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. మళ్ళి రావా ఇచ్చిన హిట్ తో తన తదుపరి సినిమాలు ఆచి తూచి వ్యవరిస్తున్నాడు సుమంత్ …
ప్రస్తుతం ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం లో నటిస్తున్నాడు… ఆ మూవీ తరువాత తన సిల్వర్ జుబ్ల్లి మూవీ అదేనండి సుమంత్ 25 వ చిత్రంగా లవ్ ఎంటర్‌టైనర్‌ ని ఎంచుకున్నాడు.. సంతోష్ జగర్లపూడి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకేక్కిన్చానున్నాడు .. కార్తికేయ ప్రొడ్యూసర్ గా చేయ్యనున్నాడు.
ఈ సినిమాలో తెలుగు అమ్మాయి ఈషారెబ్బాను హీరోయిన్‌ గా తీసుకున్నారు.  అమీతుమీ సినిమాలోని నటన, తన అందంతో ఈషాకు ఇప్పటికి చాలా అవకాశాలు పెరిగాయి. ఈ భామ రీసెంట్‌గా అ సినిమాలో నటించి మంచి మార్క్ లు కొట్టేసింది.. ఈ మధ్య వెంకటేష్- తేజ “ఆట నాదే వేట నాదే” లో  సెకండ్ లీడ్ ఛాన్స్ ని కొట్టేసింది . కాగా …. ఈ చిత్రాన్ని ఉగాదికి రోజున  అన్నపూర్ణ స్టూడియోస్ లో భారి ఎత్తున ఓపెనింగ్ పూజ చెయ్యనున్నారు.. మళ్ళి రావా లాగా మళ్ళి ఇంకో హిట్ కొడతాడో లేదో చూడాలి మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here