హీరో గా మారిన “బిత్తిరి సత్తి”

50

v6 టీవీ ఛానల్‌ “తీన్మార్” కార్యక్రమం తో మంచి పేరు తెచ్చుకొని ఫేమస్ అయిన “బిత్తిరి సత్తి” ప్రస్తుతం సినిమాల్లో నూ నటిస్తూ బిజీగా ఉన్నాడు ఈ మధ్య విన్నర్,గౌతమ్ నంద  ,గల్ఫ్ లాంటి సినిమాల్లో మెరిసాడు బిత్తిరి సత్తి…అలాగే … పలు టీవీ షోలకు గెస్ట్‌ గానూ వ్యవహరిస్తున్న సత్తి త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రజా కళాకరుడుఎమ్మెల్యేతెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి రసమయి బాలకిషన్ నిర్మాణం లో తెరకెక్కబోయే సినిమాలో “బిత్తిరి సత్తి” హీరో నటించనున్నాడు.

“బతుకమ్మ” లాంటి సినిమా కు దర్శకత్వం వహించిన టి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఉన్న ఈ చిత్రం… ఈ చిత్రానికి “తుపాకీ రాముడు” అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారు. కొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకొని తెలంగాణా అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు దర్శక,నిర్మాతలు. టీవీ షో లలో అదరగొట్టిన “సత్తి” హీరో గా ఎలా రాణిస్తాడో చూడాలి మరీ ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here