ఆ డైరెక్టర్ సైకో, నరకం చూపాడు మా నాన్న చాలా బాధపడ్డారు: బుజ్జిగాడు సంజన

225

‘బుజ్జిగాడు’ ఫేం సంజన అలీతో సరదాగా షోలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 17 ఏళ్ల వయసులోనే తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చానని, మోడలింగ్ చేసే రోజుల్లో బైక్ మీద తిరిగేదాన్ని, ఆ సమయంలో నాకు సినిమా అవకాశం వచ్చింది. దానికి సైన్ చేస్తే రూ. 2 లక్షల రెమ్యూనరేషన్‌, అప్పటికి నాకు ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేని వయసు. ఈ సినిమా చేస్తే కారు కొనుక్కోవచ్చుకదా అనే కారణంతో సైన్ చేశాను. కానీ తొలి సినిమాకే నరకం చూశాను. సంజన హిందీ మూవీ ‘మర్డర్’కు రీమేక్ ‘గండ హెండతి’ ద్వారా కన్నడ లో పరిచయం అయ్యింది. ఈ ఒక్క సినిమా డైరెక్టర్ మీద తప్ప అందరు డైరెక్టర్ల మీద నాకు గౌరవం ఉంది, ఆ సినిమా డైరెక్టర్ శాడిస్ట్, సైకో ప్రవర్తనతో ఇండస్ట్రీ అంటే భయం వేసేలా చేశాడు అని తెలిపారు.

Actress Sanjana reveals about her first movie director

‘గండ హెండతి’ మూవీ స్క్రిప్టు పూర్తిగా చదవకుండా సైన్ చేశాను. కానీ స్క్రిప్టు పూర్తిగా చూసిన తర్వాత ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ఎక్కువ ఉండటంతో దీనికి నేను న్యాయం చేయలేను అని నాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేందుకు వెళ్లాను. నువ్వు కాంట్రాక్టు మీద సంతకం చేశావు, సినిమా చేయకుంటే మోసం చేశావని కేసు పెడతాం అని డైరెక్టర్ బెదిరించాడని సంజన తెలిపారు. సినిమా విడుదలైన రోజు అమ్మా నాన్నతో కలిసి సినిమా చూశాను. సినిమాలో ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు చూసి నాన్న హర్ట్ అయ్యారు. ఇలాంటి కూతురును ఎందుకు కన్నాను అని బాధ పడ్డారు. అయితే అమ్మ పక్కనే ఉండి సర్ది చెప్పింది అని సంజన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. ఏమైనా చేసుకుంటానేమో అని అమ్మ భయపడింది, నాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసేది. థియేటర్లోకి వచ్చే వరకు అలాంటి సీన్లు ఉన్నాయని అమ్మకు కూడా తెలియదు అని సంజన తెలిపారు.

Actress Sanjana reveals about her first movie director

బుజ్జిగాడు సినిమా సమయంలో మోహన్ బాబుగారు, త్రిష అంతా కలసి సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఆ సమయంలో రాఘవేంద్రరావుగారి ప్రస్తావన వచ్చినప్పుడు .. ఫ్రూట్ డైరెక్టర్ కదా అని అనగానే వెంటనే మెహన్ బాబు గారు ఆయనకు ఫోన్ చేసి… ఒరేయ్ నువ్వు ఫ్రూట్ డైరెక్టర్ అంట అని చెప్పారు. ఆయన వెంటనే అక్కడకు వచ్చేశారు. సార్ నేను తప్పుడు ఉద్దేశ్యంతో అనలేదు…. అని ఆయనకు వివరణ ఇచ్చేలోపే ఆయన గట్టిగా నవ్వేశారు, నాకు చాలా భయం వేసింది అని సంజన గుర్తు చేసుకున్నారు.

Actress Sanjana reveals about her first movie director

తాను ప్రస్తుతం ఓ డాక్టర్ తో ప్రేమలో ఉన్నానని, అయితే అతడి పేరును ఇప్పుడే బయటకు చెప్పను, త్వరలోనే అన్ని విషయాలు చెబుతాను అని సంజన తెలిపారు. ప్రస్తుతం బాహుబలి నిర్మాతలు నిర్మిస్తున్న ‘స్వర్ణ ఖడ్గం’ అనే భారీ సీరియల్ చేస్తున్నట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here