కాన్సర్ తో హాస్పిటల్లో పోరాడుతున్న స్టార్ హీరోయిన్ ! షాక్ లో టాలీవుడ్

40
Actress Sonali Bendre Suffering With High Grade Cancer

హిందీ, తెలుగు భాషల్లో ఒకప్పుడు అనేక చిత్రాలలో నటించిన సోనాలి బింద్రే స్టార్ హీరోయిన్ గా కొనసాగిన విషయం తెలిసిందే. తెలుగు లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటించింది కృష్ణ వంశీ ఖడ్గం లో ప్రముఖ పాత్ర పోషించింది  అలాగే , మెగా స్టార్ చిరంజీవి సరసన ‘ఇంద్ర, శంకర్ దాదా ఎం.బి.బిఎస్’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కాగా ఆమె ఈ మధ్య కాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Actress Sonali Bendre Suffering With High Grade Cancer

ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ లో చిన్నగా నొప్పి కలిగితే డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకున్నానని, అది హై గ్రేడ్ కాన్సర్ అని తేలిందని, దీనికి వెంటనే చికిత్స అవసరమైనందున డాక్టర్ల సలహా మేరకు న్యూయార్క్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాని అని తెలిపారు. అలాగే ఆమె లెటర్ లో ప్రతి దశలోనూ ఈ కాన్సర్ తో పోరాడుతా అని అంది. తనపై ఇంత ప్రేమ, జాగ్రత్త చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని తెలిపింది యుద్ధం మొదలైంది.. నా వెనుక నా కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్ ఉంది అంటూ ఒక ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here