డాషింగ్ లుక్ లో అదరకొడుతున్న ఎన్టీఆర్ !

62
Aravindha Sametha Movie First Look Motion Teaser

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ విషయంలో నిన్నటి నుండి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ముందు నుండి అనుకుంటున్నట్టే చిత్రానికి ‘అరవింద సమేత..వీర రాఘవ’ అనే పేరును ఖాయం చేశారు. దీన్నిబట్టి చిత్రంలో తారక్ పేరు వీర రాఘవ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే కొన్ని నెలల పాటు చేసిన హెవీ వర్కవుట్స్ కారణంగా సాధించిన సిక్స్ ప్యాక్ బాడీని పోస్టర్ పై పూర్తిగా ప్రదర్శించాడు తారక్.

Aravindha Sametha Movie First Look Motion Teaser

ఈ లుక్ లో ఆయన చాలా డాషింగా కనిపిస్తున్నారు. అభిమానులైతే ఇదివరకెన్నడూ చూడని ఎన్టీఆర్ కనిపిస్తుండటం, టైటిల్ భిన్నంగా ఉండటంతో సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్లో నడిచే యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయకిగా అలరించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here