US సెక్స్ రాకెట్ గురించి స్పందించిన అర్చన!!!

197
Archana Responds On US Sex Racket Issue

ఇప్పుడు చికాగో సెక్స్ రాకెట్ అంశం సెన్సేషన్ కావడంతో టీవీ ఛానళ్లకు మరో సరుకు దొరికింది. దాన్ని హైలైట్ చేసుకుంటూ కథనాలు వండి వారించే కార్యక్రమం మొదలైంది. ఆయా హీరోయిన్స్ ను కానీ.. విక్టిమ్స్ ను కానీ ఇంటర్వ్యూ చేసి వారి వెర్షన్ ను టెలికాస్ట్ చేసేందుకు ముందే.. ఇండస్ట్రీలో ఎవరు దొరికితే వారికి ఫోన్ చేసేసి.. దీని గురించి మీరేం అనుకుంటున్నారు అంటూ సాగదీయడం అనే ఎపిసోడ్ ప్రస్తుతం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకూ హీరోయిన్ గా నటించిన అర్చన అలియాస్ వేదను ఇలాగే ఓ ఛానల్ ఫోన్ఇన్ ద్వారా అభిప్రాయం అడిగింది.

Archana Responds On US Sex Racket Issue

ఎవరూ ఎవరినీ విక్టిమ్ గా చేయరని.. డబ్బుల కోసం ఇలాంటివి చేసే వారి కారణంగా ఇండస్ట్రీ మొత్తాన్ని అనడం కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే.. అందరినీ ఒకేల చూడటం కరెక్ట్ కాదని అర్చన కాస్త కోపగించుకోవడం ఆలస్యం.. ఆమె మాటలను తుంచేసి.. అదే టాపిక్ ను అదే ప్రశ్నను మరో యాంగిల్ లో ఆ యాంకర్ సంధించాడు… గతంలో మీరు కూడా అమెరికా వెళ్లారు కదా అని అర్చనను అడగడం.. మీకు ఇలాంటివి ఎదురయ్యాయా అన్న ప్రశ్నకు బదులిస్తూ… మీకు ఇగింతం లేదా ఒక ఆడపిల్లని పట్టుకుని ఈ విధంగా అడగటం ఎంతవరకు కరెక్ట్…మీరేమైనా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నారా… నోటికి ఎంతమాట ఒస్తే అంత మాట అనడమేనా అని చివాట్లు పెట్టింది. ఎవరో ఒకరు చేసారు అని ఇండస్ట్రీ మొత్తానికి దీనికి లింక్ పెట్టొద్దు.. మీరు మీ డిబేట్లు అప్పుడింకా అని కాసింత అసహనం వ్యక్తపరిచారు అర్చన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here