తమిళ అర్జున్ రెడ్డి లో హీరోయిన్ ఫిక్స్

63
Arjun Reddy Tamil Remake Actress Finalized

తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రం అర్జున్ రెడ్డి.. ఈ చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం లో హీరో గా హీరో తమిళ టాప్ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ద్రువ్ కావటం విశేషం. ఈ చిత్రానికి తమిళ రీమేక్ కి “వర్మ” అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి దర్శకుడి గా తమిళ్ లో ఎన్నో హిట్ చిత్రాలు తీసిన “బాల” దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమై, నేపాల్ లో షెడ్యూల్ ఇటీవల ముగిసింది.

Arjun Reddy Tamil Remake Actress Finalized

  ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటి వరకు ఫిక్స్ అవ్వలేదు. మొదట తెలుగు అర్జున్ రెడ్డి లో నటించిన శాలిని పాండే నే తిసుకోవాలి అని ప్లాన్ చేసిన అది కుదరలేదు. సూర్య ,జ్యోతిక ,భూమిక నటించిన “ఓరు కాదల్” అనే చిత్రం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రియ శర్మ ని ఈ చిత్రం లో హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. శ్రియ శర్మపై ఇప్పటికే ఓకే చెప్పటినట్లు తాజా సమాచారం. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ని E4 ఎంటర్ప్రైజెస్ బ్యానర్ ఫై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ పురస్కార గ్రహీత అయిన రాజా మురుగన్ మాటలు రాయటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here