వైఎస్ ఆర్ బయోపిక్ లో భూమిక

47

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ ని పాకశాల , ఆనందో బ్రంహ ఫేం మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వలో షూటింగ్ మొదలు కానుంది. ఈ బయోపిక్ లో వైఎస్ఆర్ పాత్ర ని మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. జగన్ పాత్ర ను సూర్య పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నా ఈ విషయం లో స్పష్టత లేదు .

Bhumika to Play YS Sharmila Role in YSR Biopic Yatra Movie

కాగా జగన్ చెల్లెలు షర్మిల పాత్ర ని ఈ మధ్యనే ఫిక్స్ చేసారు ఈ చిత్రం బృందం. అలనాటి హీరోయిన్ భూమిక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది “మిడిల్ క్లాస్ అబ్బాయి” అనే చిత్రం లో అక్క పాత్ర ని పోషిచింది .. ఇప్పుడు నాగ చైతన్య “సవ్య సాచి” ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో షర్మిల పాత్ర కోసం భూమిక ని ఎంపిక చేసారు ఈ చిత్ర బృందం.    70ఎం ఎం బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా , శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి “యాత్ర” అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here