ఎన్టీఆర్ ఎన్టీఆరే, బిగ్ బాస్ జోలికే వెళ్ళను… నాని నాకు నచ్చలా.. సంజన సంచలన కామెంట్స్ !!!

159

బిగ్ బాస్ 2 సీజన్ నుండి అప్పుడే ఒక ఎలిమినేషన్ కూడా అయిపోయింది. బిగ్ బాస్ 2 హౌస్ లోకి అడుగుపెట్టిన సంజన అందరికంటే ముందుగా హౌస్ నుంచి ఎలిమినేటి అయింది. సంజన స్థానంలో కొత్త బ్యూటీ నందిని రాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుపెట్టబోతుండడం విశేషం. హోస్ నుంచి బయటకు వచ్చిన సంజన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.

Big Boss 2 Sanjana Choudhary about nani and BigBoss Show

బిగ్ బాస్ 2 హోస్ట్ గా నాని తనకు నచ్చలేదని సంజన తెలిపింది. తాను ఎన్టీఆర్ అభిమానిని కాబట్టి అలా అనిపించిందేమో అని సంజన తెలిపింది. కానీ నాని ఊహించినంతగా అంచనాలు అందుకోలేదని తెలిపింది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఎన్టీఆరే అంటూ వ్యాఖ్యానించింది. బిగ్ బాస్ 3 లో ఛాన్స్ వస్తే చేస్తారా అనే ప్రశ్నకు సంజన ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇక భవిష్యత్తులో బిగ్ బాస్ జోలికే వెళ్లనని సంజన తెలిపింది. బిగ్ బాస్ 2 పట్ల ఆమె నిరాశ వ్యక్తం చేసింది.

Big Boss 2 Sanjana Choudhary about nani and BigBoss Show

తనతో పాటు సామాన్యులుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన నూతన నాయుడు, గణేష్ కు రెమ్యునరేషన్ ఇవ్వలేదని సంజన వ్యాఖ్యానించింది. బిగ్ బాస్ తమకు ఓ ఫ్లాట్ ఫామ్ అని నిర్వాహకులు భావించడమే అందుకు కారణం అని సంజన తెలిపింది.తాను బిగ్ బాస్ విన్నర్ అయి ఉంటే ఓ వృద్ధాశ్రమం నిర్మించి ఉండేదానిని అని సంజన తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here