బిగ్ బాస్ 2 గురించి సంచలన విషయాలు చెప్పిన నూతన నాయుడు

152

బిగ్ బాస్ తెలుగు 2 నుండి రెండో వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన నూతన్ నాయుడు మీడియా ఇంటర్వ్యూలతో ఆయన పలు సంచలన విషయాలు చెప్పారు. అసలు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరుగుతోంది? ఎలిమినేట్ కావడానికి గల కారణాలు ఏమిటి? ఇంట్లో ఉన్న సభ్యులపై తన అభిప్రాయం ఏమిటి? తాను ఎలాంటి వాడిని? పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధం ఎలాంటిది? ఇలా పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Bigg Boss 2 Contestant Nutan Naidu Interview After Elimination

ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా ఓటింగ్ మీద జరుగుతుంది. ప్రేక్షకులు ఎవరికైతే ఓట్లు వేస్తారో వారే గెలుస్తారు. కామన్ మ్యాన్ అవడం వల్ల నన్ను బయటకు పంపారు అనేది నిజం కాదు అని నూనత్ నాయుడు తెలిపారు. సంజన బిగ్ బాస్ హౌస్‌లో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పడం తన వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవంగా అక్కడ అలాంటివేమీ జరుగవు. అందరూ చాలా చక్కగా ఉంటారు. 24 గంటల్లో గంట మీకు చూపించడానికి కొన్ని డ్రమాటిక్ సీన్స్, సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి చూపిస్తారు, అయితే కాస్త కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కాస్త కాఠిన్యం, అలాగే కాస్త కారుణ్యం కూడా ఉంది అని నూతన్ నాయుడు తెలిపారు.

Bigg Boss 2 Contestant Nutan Naidu Interview After Elimination

గతంలో పీఆర్పీ నుండి పోటీ చేసి ఓడిపోయిన మాట నిజమే. అయితే జనసేనలో నాకు ఎలాంటి సభ్యత్వంకానీ, పదవి కానీ లేవు. పవన్ కళ్యాణ్ అంటే అత్యంత అభిమానం, ఆయనకు వీర భక్తుడిని, ఆయనతో వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉన్న మాట వాస్తవం. పవన్ కళ్యాణ్‌ది అమోఘమైన వ్యక్తిత్వం, భగవంతుడి స్వరూపం ఆయన. నేను ఆయన్ను దేవుడిగా భావిస్తాను. ఆయన, నేను కలిసి మాట్లాడుకుని చాలా సంవత్సరాలైంది. ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో నేను తెలుసుకున్నది ఏమిటంటే అటు వంటి వ్యక్తి న బూతో న భవిష్యత్… నేను నా కార్యక్రమాల్లో చాలా ఆక్యుపైడ్‌గా ఉండటం వల్ల జనసేనతో ఏ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరుగలేదు. అని నూతన్ నాయుడు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here