బిగ్‌బాస్‌ 2 – నాని పారితోషికం, సెలబ్రిటీల రెమ్యునరేషన్ల జాబితా లీక్

81

బిగ్‌బాస్ రెండో సీజన్ బ్రహ్మండంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా జూన్ 10న అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండో సీజన్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో నాని ఫెర్ఫార్మెన్స్ లేదని కొన్నివర్గాలు అంటుంటే.. ఇప్పుడే మొదలైందిగా.. కాస్త ఆగండి నాని తడాఖా చూపించడం ఖాయమంటున్నారు మరికొందరు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న 16 మంది సెలబ్రిటీల రెమ్యునరేషన్ వివరాలకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Bigg Boss Season 2 : Huge Remuneration To Bigg Boss Contestants

బిగ్‌బాస్2 విషయానికి వస్తే పెద్దగా ప్రేక్షకులను బుల్లితెర వైపు ఆకర్షించే స్టార్ హీరో, హీరోయిన్లు లేకపోవడం సామ్రాట్ రెడ్డి, తనీష్ లాంటి చిన్న చితక హీరోలు, తేజస్వి మదివాడ, సింగర్ గీతా మాధురి లాంటి చిన్నపాటి సెలబ్రిటీలు ఈ షోకు ఆకర్షణగా మారినా ఇంకా అంత క్రేజీ రాలేదు అని అంటున్నారు. బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించినందుకు గాను.. 106 ఎపిసోడ్స్ కోసం నానికి రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ ముట్టినట్టు తెలుస్తున్నది. ఇక 16 మంది సెలబ్రిటీల రెమ్యునరేషన్ వివరాలంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది.

Bigg Boss Season 2 : Huge Remuneration To Bigg Boss Contestants

ఈ సెలబ్రిటీల జాబితాలో గీతా మాధురిదే అత్యధిక అత్యధికంగా రూ.20 లక్షల పారితోషికాన్ని ఇచ్చేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. తర్వాత అత్యధికంగా తనీష్, అమిత్, బాబు గోగినేని, తేజస్వికి రూ.8 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. ఇక ఐదు లక్షల రూపాయలు తీసుకొంటున్న వారిలో యాంకర్ శ్యామల, దీప్తి సునయన, రోల్ రైడా, సామ్రాట్ రెడ్డి, కిరిటీ దామరాజు, కౌశల్, భాను శ్రీ ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక రూ.3 లక్షలు తీసుకొంటున్న వారిలో టీవీ9 యాంకర్ దీప్తి, గణేష్, నూతన్ నాయుడు, సంజనా ఉన్నారు. ఈ వివరాలపై అధికారికంగా ధ్రువీకరించలేదు కానీ.. మంచి రెమ్యూనరేటిన్ మాత్రం దక్కించుకోనున్నట్లు తెలుస్తుంది.

Bigg Boss Season 2 : Huge Remuneration To Bigg Boss Contestants

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here