బిగ్‌బాస్2: గెలుపు ఎవరిదో చెప్పిన కిరీటి! అతడి వల్లే నేను ఎలిమిటె అయ్యాను

155
Bigg Boss Telugu 2 : Kireeti Exclusive Interview after elimination

తెలుగు బిగ్ బాస్ 2 రసవత్తరంగా సాగుతోంది. మూడవ వారంలో కిరీటి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తొలి రెండు వారాల్లో సామాన్యులు గా ఉన్న సంజన, నూతన్ నాయుడు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారంలో మాత్రం సెలెబ్రిటీ అయిన కిరీటిని బయటకు పంపడం విశేషం. తాజగా ఓ ఇంటర్వ్యూలో కిరీటి పలు ఆసక్తికర విషయాలు బిగ్ బాస్ గురించి తెలియజేశాడు. బిగ్ బాస్ అనేది అద్భుతమైన గేమ్ షో, తాను షోనుంచి ఎలిమినేట్ అయ్యాననే భాద లేదని, బిగ్ బాస్ అనేది గేమ్ షో కాబట్టి ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదని తెలిపాడు.

Bigg Boss Telugu 2 : Kireeti Exclusive Interview after elimination

కానీ కౌశల్, తేజస్వి మధ్య జరిగిన గొడవలో కౌశల్ పద్ధతి నచ్చలేదని, ఆ విషయాన్ని అతడికే చెప్పానని, ఒకవేళ కౌశల్ కెప్టెన్ అయితే ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడు ఇలాంటి వైఖరితో ఉండకూడదు. ఈ విషయాన్నే అతడికి చెప్పానని కిరీటి వివరించాడు. తాను బిగ్ బాస్ హౌస్ లోపల ఉండడం వలన బయట ఎలాంటి ప్రచారం జరుగుతుందో తెలియదని, హౌస్ నుంచి బయటకు వచ్చాక తనపై కొంత నెగిటివిటి ఉందని సన్నిహితుల ద్వారా తెలిసిందని కిరీటి తెలిపాడు. బిగ్ బాస్ 2 ద్వారా బాబు గోగినేని తనకు బెస్ట్ ఫ్రెండ్ గా దొరికారాని, ఆయనతో జీవితాంతం స్నేహం కొనసాగిస్తానని కిరీటి తెలిపాడు. తాను తన ఎలిమినేషన్ ముందే ఊహించానని, ఎలిమినేషన్ కు ముందు రోజు.. ఛ.. నీకు హగ్ ఇవ్వను అని నాని అన్నాడు. అప్పుడే తనకు అర్థం అయిందని కిరీటి తెలిపాడు.

Bigg Boss Telugu 2 : Kireeti Exclusive Interview after elimination

సామ్రాట్, తేజస్వి మధ్య ప్రేమాయణం వ్యవహారంపై కిరీటి స్పందించాడు. వారిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే, తాను గమనించినత వరకు వారు మంచి స్నేహితులుగా ఉన్నారు, ఇక పై ప్రేమికులుగా మారుతారేమో తనకు తెలియదని తెలిపాడు. కౌశల్ ని టార్గెట్ చేయడం వెనుక మరో ఉద్దేశం లేదని కిరీటి తెలిపాడు. తన వెనుక కూడా ఎవరూ లేరని తెలిపాడు. బిగ్ బాస్ 2 టైటిల్ గెలిచే సత్తా టీవీ9 దీప్తి, యాకర్ శ్యామలకు ఎక్కువ అవకాశాలు ఉన్నా, తేజస్వికి వాళ్లకన్నా ఎక్కువ అవకాశం ఉందని కిరీటి వివరించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here