బిగ్ బాస్ 2 మూడో వారం ఎలిమినేషన్: మీ ఓటు ఎవరికి?

42
Bigg boss telugu 2 third week eliminations

బిగ్ బాస్ తెలుగు 2 విజయవంతంగా మూడో వారంలోకి ప్రవేశించింది. తొలివారం సంజన అన్నె, రెండో వారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసింతే. తాజాగా మూడోవారం ఎలిమినేషన్‌కు నామినేషన్లు పూర్తయ్యాయి. ఈ వారం గీతా మాధురి, గణేష్, తేజస్వి మదివాడ, భానుశ్రీ , కిరిటీ నామినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు వచ్చే ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లనున్నారు.

Bigg boss telugu 2 third week eliminations

వాస్తవంగా నామినేషన్లు అనేవి సీక్రెట్‌గా జరగాలి. బిగ్ బాస్ రూటు మార్చాడు. ఈ వారం అందరినీ లివింగ్ రూమ్‌లోనే కూర్చోబెట్టి ఓపెన్‌గా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. ముందుగా అమిత్ కెప్టెన్ అయినందున నామినేషన్ ప్రక్రియ నుండి అతడికి మినహాయింపు ఇచ్చారు. నందిని వచ్చి కేవలం వారం రోజులు మాత్రమే అయినందున ఆమెకు కూడా ఈవారం నామినేషన్ల నుండి తప్పించారు.

Bigg boss telugu 2 third week eliminations

గణేష్, కిరిటీ మెడలో అత్యధికంగా 7 ట్యాగ్స్ పడగా, గీతా మాధురి, భానుశ్రీ మెడలో మూడు ట్యాగ్స్ చొప్పున పడ్డాయి. ఇక తేజస్వి మదివాడకు రెండు ట్యాగ్స్ వచ్చాయి. దీంతో ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయినట్లు ప్రకటించారు. ఈ సారి ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. మరి ప్రేక్షకులు ఈవారం కూడా సామాన్యుడినే ఇంటి నుండి బయటకు పంపుతారా? లేక సెలబ్రిటీలను పంపుతారా? అనేది వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here