బాబు గోగినేనిపై కేసు నమోదు…. చిక్కుల్లో బిగ్ బాస్… ఎలిమినేషన్ తప్ప వేరేదారి లేదు!!!

218
Case Filed on Big Boss Telugu 2 Contestant Babu Gogineni

బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేనిపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మతాన్ని కించపరిచేలా యూట్యూబ్‌ వీడియోలో మాట్లాడారని, వారు చేపట్టే ప్రైవేటు కార్యక్రమం కోసం ఆధార్‌ నంబర్లను తీసుకోవడంపై కేవీ నారాయణ అనే వ్యక్తి ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం బిగ్ బాస్ 2 రియాల్టీ షోలో ఉన్న బాబు గోగినేని ఈ కేసు నేపథ్యంలో బయటకు వస్తారా? నెక్ట్స్ ఏం జరుగబోతోంది? అనేది చర్చనీయాంశం అయింది.

Case Filed on Big Boss Telugu 2 Contestant Babu Gogineni

మాదాపూర్‌ పోలీసులు బాబు గోగినేనిపై 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో ఉన్న ఆయన న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదు. మరి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది హాట్ టాపిక్ అయింది. బిగ్ బాస్ 2 మూడో వారంలో సోమవారం ఎలిమినేషన్ నామినేషన్లు జరిగాయి. ఈ లిస్టులో బాబు గోగినేని లేరు, ఎలిమినేషన్ జాబితాలో ఉండి ఉంటే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉండేదేమో?

Case Filed on Big Boss Telugu 2 Contestant Babu Gogineni

గత సీజన్లో కూడా ముమైత్ ఖాన్ బిగ్ బాస్ ఇంట్లో ఉండగా…. ఆమె టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. దీంతో ఆమెను ఇంటి నుండి ఎలిమినేట్ చేసి మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోనికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బాబు గోగినేని విషయంలో కేసు తీవ్రతను బట్టి, ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుందా? లేక లాయర్ వచ్చి ఆయన సంతకాలు తీసుకుని వెళితే సరిపోతుందా? అనే అంశంపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది బిగ్ బాస్ చేతిలోనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here