శ్రీ రెడ్డి కి మరో సామాన్యుడి లేఖ

52
Common man questioned to Sri Reddy on her demands in TFI

శ్రీ రెడ్డి ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరేమో …తెలుగు సినిమా పరిశ్రమ లో కాస్టింగ్ కోచ్ జరుగుతుంది …దానికి చాల మంది తెలుగు అమ్మాయిలు భలి అవుతున్నారు ..ఆమె పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే …ఈ విషయం ఫై ఒక సామన్యుడు శ్రీ రెడ్డి కి ఒక లేఖ రాసాడు..

పరిశ్రమలో 90% అవకాశాలు తెలుగువారికే ఇవ్వాలా?

బాగుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా రిజర్వేషన్ సిస్టం తేవాలని డిమాండ్ చేస్తారా?

అయితే కొన్ని డౌట్స్…..

పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా? ఆవిడ ఎందుకు ఒక్క సినిమాతో ఆగిపోయారో ఆలోచించారా?

మహనటులు ఎస్వి రంగారావు గారి మనవడి సినిమా ఒకటి గతంలో విడుదలైందనే విషయం ఎంత మందికి తెలుసు……

మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు పాతిక దాకా సినిమాలు చేసినా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయారు. తర్వాత సినిమా వదిలేసి ఇతర వ్యాపకాల్లో బిజీ అయిపోయారు……….

శోభన్ బాబు గారు ఆయన వారసుడిని తెరకు పరిచయం చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు…..

గిరిబాబు గారు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినా పెద్ద కొడుకు బోసు బాబుతో ఒక్క సినిమా మించి తీయలేకపోయారు…

సీనియర్ నటులు నరేష్ గారు ఎంత పలుకుబడి ఉన్నా అబ్బాయిని హీరో చేయటంలో ఇంకా పోరాడుతూనే ఉన్నారు…..

బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ ఎంత ప్రయత్నించినా ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా తమ బిడ్డలను హీరోలుగా సెటిల్ చేయలేక సైలెంట్ అయ్యారు……

దర్శకేంద్రుల వారి అబ్బాయిని ఉషాకిరణ్ సంస్థ నీతో సినిమా ద్వారా పరిచయం చేస్తే నటుడిగా తర్వాత ఒక్క ఆఫర్ కూడా రాలేదు……

తారకరత్న తొమ్మిది సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే అందులో సగం షూటింగ్ కూడా పూర్తయ్యాయో లేదో ఎవరికి తెలియదు……

నాగబాబు హీరోగా నాలుగేళ్లు వరసగా సినిమాలు తీసిన నిర్మాతలు వర్క్ అవుట్ కావడం లేదని వదిలేశారు. తర్వాత ఆయన సపోర్టింగ్ రోల్స్ కు రావాల్సి వచ్చింది….

ఇలా లెక్కకు మించి ఉన్నాయి చెప్పుకుంటూ పోతే.. నిర్మాత ఎవరినో ఉద్ధరించడానికి సినిమాలు తీయడం లేదు. ఇది వ్యాపారం. హక్కుల గురించి మీటింగులు పెట్టి మాట్లాడే ముందు సుల్తాన్ బజార్ లో ఓ అద్దం కొనుక్కుని అందులో చూసుకుని వెళ్లవలసిందిగా మనవి…..

ఎవరివైనా మనోభావాలు దెబ్బ తిని ఉంటే దానికి పూర్తి బాధ్యత మీదే….

ఇట్లు
చిరాకుతో
ఓ సినిమా అభిమాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here