ఎటువంటి మంచి పనులు చేయకపోయినా నాగార్జున లాంటి మంచి మనిషి దొరికాడు

31
Director Ram Gopal Varma Very Emotional Speech @ Officer Movie Pre Release Event

రామ్ గోపాల్ వర్మ – నాగార్జున ఎంత సూపర్ హిట్ కాంబినేషన్ ఓ అందరికి తెలుసు .. చాల గ్యాప్ తరువాత ఈ కాంబినేషన్ లో “ఆఫీసర్” అనే మూవీ రాబోతుంది. ఈ చిత్రం జూన్ 1 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.  ఈవెంట్‌లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ ప్రసంగించేందుకు వేదికపైకి వస్తుండగా కొంతమంది ఫారిన్ అమ్మాయిల గ్రూపు ఆయనను స్టేజీ మీదకు తీసుకొచ్చింది. దీనిపై వర్మ సరదాగా మాట్లాడారు.

Director Ram Gopal Varma Very Emotional Speech @ Officer Movie Pre Release Event

దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను ఫారిన్ అమ్మాయిల ఐడియా నాది కాదు. ఇది తన యూనిట్‌లో ఉండేవారు తన మీద చేసిన కుట్ర అని అన్నారు. ఈ విషయాన్ని నాగార్జున నమ్మితే చాలు. నా మీద కుట్ర పన్నినోళ్ల సంగతి తర్వాత చూస్తాను. అంటూ సరదాగా అన్నారు. అలాగే నేనెప్పుడూ పుణ్యాలు చేయలేదని, ఎప్పుడూ పెద్దలను గౌరవించలేదని, దేవుడిని కూడా ఎప్పుడూ పూజించలేదని, ఎటువంటి మంచి పనులు చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచి వ్యక్తి నా జీవితానికి దొరికాడు. ఇంతకు మించి మాట్లాడితే నా కళ్లలో నీళ్లు వచ్చేట్లు ఉన్నాయంటూ వర్మ కాస్త ఎమోషనల్ ఫీల్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here