ఈ నగరానికి ఏమైంది? సినిమా రివ్యూ – ని గ్యాంగ్ తో రా థియేటర్ కి చూసుకుందాం

305
Ee Nagaraniki Emaindi telugu movie review and rating

భారతీయ సినీ పరిశ్రమలో దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు పెళ్లిచూపులు చిత్రం మంచి గుర్తింపు అవార్డులు, రివార్డులు సంపాదించి పెట్టింది. దాంతో తన రెండో చిత్రంగా తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని రూపొందించి జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంతో మరో హిట్ కొట్టారా లేదా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

వేక్, కార్తీక్, ఉపేంద్ర, కౌశిక్ (విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను) చిన్ననాటి నుండి స్నేహితులు. బిగ్ మూవీస్ రూపొందించాలనే లక్ష్యంతో షార్ట్ ఫిలిం తీయడం ద్వారా నిర్మాతలను ఆకర్షించి లక్ష్యం వైపు ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో వివేక్ (విశ్వక్ సేన్)కు శిల్ప (సిమ్రాన్ చౌదరీ)తో బ్రేకప్ జరుగుతుంది. ఆ తర్వాత ఓ రకమైన డిప్రెషన్ లోకి వివేక్ వెళ్లిపోతాడు. దాంతో వారు షార్ట్ ఫిలింస్ తీయడం ఆపేసి ఏదో పనిచేస్తూ జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంటారు. ఆ సమయంలో ఓ సమస్యలో ఇరుక్కుపోవడంతో కార్తీక్ ఐదు లక్షలు అవసరం అవుతాయి. దానికోసం నలుగురు ఫ్రెండ్స్ మళ్లీ షార్ట్ ఫిలిం తీసి కార్తీక్‌ను ఆదుకోవాలని ఫిక్స్ అవుతారు. కార్తీక్ వచ్చిన సమస్య ఏమిటి? వివేక్ షార్ట్ ఫిలిం తీసి దర్శకుడిగా సక్సెస్ అవుతాడా? కౌశిక్ (అభినవ్ గోమటం) నటుడిగా స్థిరపడ్డారా? కార్తీక్ సినిమాటోగ్రఫర్‌గా సక్సెస్ అయ్యాడా? ఉపేంద్ర ఎడిటర్‌గా స్థిరపడ్డారా? వివేక్ లవ్ ఎందుకు బ్రేకప్ అయింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ నగరానికి ఏమైంది చిత్ర కథ.

Ee Nagaraniki Emaindi telugu movie review and rating

ఇక చిత్ర మొదటి భాగంలో నలుగురు హీరోల క్యారెక్టర్ పరిచయం, వారి మధ్య ప్రేమ, చిన్న చిన్న గొడవలతో చకచకా గడిచిపోతుంది. పంచ్ డైలాగ్స్ పేలడంతో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. వివేక్ బ్రేకప్ తో కథ వేగం అందుకుంటుంది. ఈ నేపథ్యంలో అభినవ్ డైలాగ్స్ మంచి ఫీల్ కలుగుతాయి. షేర్లీ (అనిశా అంబ్రోస్) పాత్ర ద్వారా ఫ్లాష్ బ్యాక్ సీన్లను చెప్పడం ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలుగుతుంది. అయితే కథ రన్నింగ్లో బలమైన పాయింట్ లేకపోవడం, ఎమోషన్ సీన్స్ పండగపోవడంతో కేవలం వినోదంతోనే సర్దిపెట్టుకోవాల్సి వస్తుంది.

Ee Nagaraniki Emaindi telugu movie review and rating

ఇక రెండో భాగంలో కథ గోవాలోని అందమైన ప్రదేశాల మధ్య స్టోరి కొత్త మలుపు వైపు తిరుగుతుంది. షేర్లీ సెకండాఫ్ ఎంట్రీ ఇవ్వడం, ఐదు లక్షలు సంపాదించేందుకు షార్ట్ ఫిలిం తీసే ప్రాసెస్ షెర్లీ భాగమవ్వడం, వివేక్‌ తో లవ్ ట్రాక్ నడపడం ప్రేక్షకుడికి కొంత ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. సెకండాఫ్‌లో సీన్లన్నీ కొంత అతికించినట్టుగా, ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. చివరకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌తో స్టోరికి ముగింపు కార్డు పడుతుంది.

Ee Nagaraniki Emaindi telugu movie review and rating

పెళ్లిచూపులు దర్శకుడిగా తరుణ్ భాస్కర్ తొలి చిత్రానికి భిన్నంగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో విడుదలకు ముందే రొమాంటిక్ కామెడీ అనే ఫీలింగ్ కలుగజేశారు. పాత్రలను డిజైన్ చేసిన తీరు ఆయన ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది. పవర్ఫుల్ సన్నివేశాలు లేకపోయినప్పటికీ ప్రేక్షకులను అలరించే అభినవ్ గోమటం పాత్రను మలిచిన విధానం శభాష్ అనిపించేలా ఉంటుంది. అయితే ఇతర పాత్రలను మరింత ప్రభావవంతంగా మలిచితే మరో మంచి చిత్రంగా మార్కులు సంపాదించే అవకాశం ఉండేది.

Ee Nagaraniki Emaindi telugu movie review and rating

నలుగురు స్నేహితులుగా విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను కనిపించారు. హీరోయిన్లలో బాగా ఆకట్టుకునేది అనిశా అంబ్రోస్ పాత్ర. గతంలో పలు చిత్రాల్లో అనిశా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రంలో కూడా తనకు లభించిన సీన్లలో అందం, అభినయాన్ని ప్రదర్శించింది. మరో హీరోయిన్ సిమ్రాన్ చౌదరిదీ గెస్ట్ లాంటి రోల్. ఈ నగరానికి ఏమైంది చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.యూత్‌ను టార్గెట్ చేసి ఆల్బమ్‌ను రూపొందించారనే ఫీలింగ్ కలుగుతుంది.

Ee Nagaraniki Emaindi telugu movie review and rating

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో వారి చాయిస్ బాగుందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ సతీమణి లతా తరుణ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఫైనల్‌గా ఈ నగరానికి ఏమైంది చిత్రం విషయానికి వస్తే ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను టార్గెట్‌గా చేసుకొని రూపొందించిన న్యూ జనరేషన్ చిత్రమని పక్కాగా చెప్పవచ్చు. పెళ్లిచూపులు సినిమా ని దృష్టిలో పెట్టుకోకుండా థియేటర్ కెళ్లితే వినోదాన్ని ఆస్వాదించవచ్చు. పూర్తిగా ఇది మల్టీప్లెక్స్ సినిమా అని కూడా చెప్పలేం. ఇక సీ సెంటర్ ఆడియెన్స్‌ను పూర్తిగా వదిలేస్తే.. బీ సెంటర్ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చిన ఈ నగరానికి ఏమైంది ఓ రేంజ్ సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది.

Ee Nagaraniki Emaindi telugu movie review and rating

బలం –
తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం డైలాగ్స్ వివేక్ సాగర్ ప్రొడక్షన్ వాల్యూస్

బలహీనతలు
కథ, కథనం స్లో నేరేషన్ ఎమోషన్స్ లేకపోవడం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here