లండన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న గోపీచంద్ ‘పంతం’

41
Hero Gopichand Latest Movie Pantham Updates

గోపీచంద్‌, మెహరీన్‌ పిర్జాడ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పంతం’. ఫర్‌ ఏ కాజ్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా తెరకెక్కుతుండగా బలుపు, పవర్‌, జై లవకుశ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో గోపీచంద్ కెరీర్‌లో ఈ చిత్రం 25వ సినిమాగా తెరకేక్కుతుండటం విశేషం.గోపీచంద్ కి ఈ చిత్రం సిల్వర్ జూబ్లి ఫిలిం.

Hero Gopichand Latest Movie Pantham Updates

కాగా  ఈ సినిమా ప్రస్తుతం యూకేలో షూటింగ్ జరుపుకుంటుంది. స్కాట్లాండ్, లండ‌న్‌లలో పాటలను చిత్రీకరించుకుని అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చిత్రయూనిట్ జరుపుకోనుంది. గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జూలై లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here