హీరోగా మారి హాస్యభరితమైన సినిమాల తో దూసుకెళ్తున్న కమెడియన్ శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ‘జంబ లకిడి పంబ’ అనే కామెడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. జూన్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కావలసి ఉండగా ఈ సినిమాను తరువాతి వారానికి వాయిదా వేసుకున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ ‘నా నువ్వే’, సుధీర్ బాబు ‘సమ్మోహనం’ సినిమాలు విడుదల కానుండడంతో సినిమాను వాయిదా వేసుకున్నారు. కాగా ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. మెయిన్ లైన్ ప్రొడక్షన్స్ , శివం సెల్లిలిడ్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాగా శ్రీనివాస్ రెడ్డి సరసన కొత్త హీరోయిన్ సిద్ది ఇద్నని నటిస్తుంది. అలాగే ఈ చిత్రం లో తనికెళ్ళ భరణి , వెన్నల కిశోర్ , పోసాని కృష్ణ మురళి నటిస్తున్నారు.