ఉత్తమ నటుడు విజయ్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడు రాజమౌళి ( ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్)

81
Jio filmfare awards south winners list

65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడక శనివారం రాత్రి (జూన్ 16) హైదరాబాద్‌లోని నోవాటెల్ & హెచ్‌ఐసిసి కాంప్లెక్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఆయా భాషాల్లో ఉత్తమ సినిమాలు, నటులు, టెక్నీషియన్లకు అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అందరూ ఊహించినట్లే బాహుబలి 2 చిత్రానికి అవార్డుల పంట పండింది.

Jio filmfare awards south winners list

ఈ సారి ఉత్తమ నటుడు కేటగిరీలోమెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ తో పాటు యంగ్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ పేర్లు నామినేట్ అవ్వగా…. అర్జున్ రెడ్డి సినిమాలో నటనకుగాను విజయ్ దేవరకొండను ఉత్తమ నటుడు అవార్డ్ వరించింది. ఫిదా చిత్రానికి గాను సాయి పల్లవి ఉత్తమ నటి అవార్డ్ సొంతం చేసుకుంది. రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు.

ఫైనల్ లిస్ట్

ఉత్తమ చిత్రం: బాహుబలి 2-ది కంక్లూజన్
ఉత్తమ దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి (బాహుబలి2-ది కంక్లూజన్)
ఉత్తమ నటుడు : విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)
ఉత్తమ నటి : సాయి పల్లవి (ఫిదా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : వెంకటేష్ (గురు)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రితికి సింగ్ (గురు)
ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి (బాహుబలి 2- ది కంక్లూజన్)
ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి2-ది కంక్లూజన్)
ఉత్తమ సంగీతం: ఎంఎం కీరవాణి(బాహుబలి2- ది కంక్లూజన్)
ఉత్తమ గీత రచన: ఎంఎం కీరవాణి ( దండాలయ్యా….బాహుబలి 2- ది కంక్లూజన్)
ఉత్తమ గాయకుడు : హేమచంద్ర (ఊసుపోదు-ఫిదా)
ఉత్తమ గాయకురాలు: మధు ప్రియ (వచ్చిందే…ఫిదా)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here