త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా లో రెండో హీరోయిన్ గా తెలుగమ్మాయి

53
Jr NTR's Aravinda Sametha Veera Raghava Movie Second Heroine Name Revealed

అజ్ఞాతవాసి లాంటి భారీ ఫ్లాప్ తరువాత త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం “అరవింద సమేత వీర రాఘవ” . ఈ చిత్రం లో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ చిత్రం ఎన్టీఆర్ 28 వ చిత్రం గా వస్తుంది. హరిణి , హాసిని క్రియేషన్ బ్యానర్ ఫై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది. ఆ లుక్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Jr NTR's Aravinda Sametha Veera Raghava Movie Second Heroine Name Revealed

కాగా ఈ చిత్రం లో మొదటి హీరోయిన్ గా పూజ హెడ్గే నటిస్తుంది. ఈ స్క్రిప్ట్ ని భట్టి ఈ చిత్రం లో రెండో హీరోయిన్ అవసరం.  ఇందు కోసం తెలుగు అమ్మాయి అయిన “ఈషా రెబ్బ” ని ఎంపిక చేసారు. ఈ మధ్య కాలంలో ఆమె అమీ తుమి, ఇప్పుడు సుమంత్ సరసన సుబ్రహ్మణ్యం అనే మూవీ చేస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద చిత్రం లో ఆఫర్ అందుకున్న ఈషా త్వరలో టాప్ ప్లేస్ కి వెళ్తుంది ..అని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here