ఎట్టకేలకు కత్తి మహేష్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్న బంజారాహిల్స్ పోలీసులు

169
Kathi Mahesh Arrest At Banjara Hills Police Station

సినీ విమర్శకుడు , నటుడు, దర్శకుడు కత్తి మహేష్ ఎప్పుడు వివాదలతో సావాసం చేసే విషయం తెలిసిందే. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులకు కత్తి మహేష్ మధ్య జరిగిన గొడవ అంత ఇంత కాదు. నెమ్మదిగా ఆ గొడవ పూర్తి పూర్తీ అయ్యింది. ఈ మధ్య ఒక ప్రముఖ టివి ఛానెల్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో  కత్తి మహేశ్‌  ఫోన్‌ లైన్ లో మాట్లాడుతూ..  హిందూ దేవుడు అయిన శ్రీ రాముడి పై ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

Kathi Mahesh Arrest At Banjara Hills Police Station

దీంతో తమ ఆరాధ్య దైవాన్ని కత్తి మహేశ్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. కత్తి మహేష్ దిష్టి బొమ్మలు దగ్నం చేసారు. కత్తి మహేష్ ఫై బంజారాహిల్స్ పోలీసులకు కొంత మంది పిర్యాదు చేసారు. దీంతో  బంజారాహిల్స్ పోలీసులు కత్తి మహేష్ ను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. హిందూ మత సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుతో U/SEC IPC 295(A) IPC 505 (2)సెక్షన్ ల కిందా కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.
అరెస్ట్ విషయమై కత్తి మహేష్ స్పందిస్తూ.. తాను మాట్లాడింది తప్పుకాదు కాబట్టి ఎక్కడకి అయినా వెళతానని, కోర్టులో కూడా పోరాడుతానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here