విజయ్ దేవరకొండ ఇంటికి కేటీఆర్ – ఏదైనా జరుగవచ్చు

63
KTR Surprise Visit To Vijay Devarakonda's House

పెళ్లి చూపులు చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ స్టార్‌గా అయ్యిపోయాడు. తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న విజయ్ దేవరకొండకి మంత్రి కేటీఆర్‌ అంటే బాగా ఇష్టం అలాగే కేటీఆర్‌కి కూడా ఇష్టమే. తాజాగా మంత్రి కేటీ తారకరామారావును విజయ్ దేవరకొండ లంచ్‌కు ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ ఇంటికి విందుకు రావడంపై విజయ్ స్పందిస్తూ..

KTR Surprise Visit To Vijay Devarakonda's House
నా ఫేవరేట్ నాయకుడు ఇంటికి లంచ్‌కు రావడంతో ఒక సెకన్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బేసిక్‌గ్గా ఏమైనా జరుగొచ్చు. మనం ప్రేమించే వారిని ఇష్టంగా ప్రేమిస్తూ పోవాల్సిందే అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. నా ఇష్టమైన నాయకుడికి నా ప్రపంచాన్ని చూపించాను. నా రౌడీ మూక గురించి చెప్పాను. చేనేత వస్థ్రాల వినియోగంపై నాకు అవగాహన కల్పించారు. నీటిని నిల్వ చేయడం, హైదరాబాద్ రోడ్ల దుస్థితి, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి జరిగే ముప్పు గురించి కేటీఆరే కాదు.. ఆయన తండ్రి బాస్ కేసీఆర్‌కు జాగ్రత్తలు చెబుతున్నారు అని విజయ్ దేవరకొండ మరో ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here