నెరేళ్ల వేణుమాధవ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన పలువురు సినీ రాజకీయ ప్రముఖలు..

51
Legendary mimicry artiste Nerella Venu Madhav passes away

ప్రముఖ మిమిక్రి కళాకారుడు, పద్మశ్రీ నెరేళ్ల వేణుమాధవ్ మృతిపట్ల ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మిమిక్రి కళకు నెరేళ్ల వేణుమాధవ్ చేసిన సేవలు గణనీయమైనవన్నారు. తెలంగాణ బిడ్డగా నెరేళ్ల అంతర్జాతీయ స్థాయికి ఎదిగి మిమిక్రి కి వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.

Mimicry artist Nerella Venu Madhav passed away

ప్రఖ్యాత మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ మృతి పట్ల నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతికి లోనయ్యారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రపంచానికి సుపరిచితుడు ఆయన వేణుమాధవ్ తెలంగాణ బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో మిమిక్రీ కళాప్రదర్శనలు యిచ్చిన ఆయన సినిమాల్లోనూ నటించారని, ఎమ్మెల్సీగా ప్రజలకు సేవ చేశారని తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వేణుమాధవ్ మృతితో మిమిక్రీ లోకం మూగపోయింది అన్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ఎంపి కవిత ప్రగాఢ సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here