హీరో నాని – శ్రీ రెడ్డి ఇష్యూపై మాధవి లత ఎవరూ ఊహించని కామెంట్స్ !!!

413

హీరో నానితో కలిసి ‘స్నేహితుడా’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మాధవిలత ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఎవరూ ఊహించని కామెంట్ చేశారు. ఇటీవల నాని మీద వినిపిస్తున్న ఆరోపణల సంబంధించిన ప్రశ్నలు కు సమాధానం ఇస్తూ…

‘స్నేహితుడా’ సినిమా తర్వాత నాని, నేను అసలు టచ్ లో లేము. ఎప్పుడైనా ఈవెంట్స్‌లో కనిపిస్తే హాయ్, హలో, హౌ ఆర్ యూ అనుకునేవాళ్లం. అపుడు సెట్స్‌లో ఎవరి పని వారు చేసుకునే వాళ్లం. మా ఇద్దరికీ కాంబినేషన్ ఉన్న స్క్రిప్టు ఎక్కువగా ఉండేది. కామెడీ సీన్లు ఎక్కువగా ఉండేది. స్క్రిప్టులో ఇద్దరి ఇన్వాల్మెంట్ ఉండేది. దీంతో డైలాగ్ డెలివరీ ఇలా ఉంటే బావుంటుంది, ఇలా చెబితే బావుంటుంది…అని సలహాలు ఇచ్చేవాడు. ఇద్దరం చాలా జోవియల్ గా ఉండేవారం అని మాధవి లత తెలిపారు.

Madhavi Latha opens up on Sri Reddy Comments on Hero Nani Behaviourఇటీవల నానిపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందంటారా? అనే ప్రశ్నకు మాధవి లత స్పందిస్తూ….. కొత్తలో వచ్చినపుడు ఎవరికైనా ఒక భయం అనేది ఉంటుంది. స్టార్ డమ్ పెరుగుతున్న కొద్దీ మేము ఏం చేసినా నడుస్తుంది అనే ఒపీనియన్ కూడా ఉండొచ్చు. చేస్తే చేసుండొచ్చు…. అని మాధవి లత అన్నారు. నేను ఈ విషయంలో అమ్మాయిల ద్వారా కొన్ని విన్నాను. నేను వాళ్ల పేర్లు చెప్పను. ఎందుకంటే అందులో కొందరు బాగా తెలిసిన వారు ఉన్నారు. ఇది ఇప్పుడు విన్నది కాదు, 2012 నుండి వింటున్నాను. నేను మొదట ఈ మాట విన్నది ఇప్పటికీ గుర్తుంది. అపుడు నేను చదువుకోవడానికి లండన్ వెళ్లాను. ఇంకొక అమ్మాయికి, నాకు మధ్య ఉన్న కామన్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి మీ హీరో ఇలా చేశారట, అలా చేశారట అని చెప్పేవారు.

Madhavi Latha opens up on Sri Reddy Comments on Hero Nani Behaviourనాకు ఆ విషయం చెప్పగానే ఒకటే అన్నాను… మా హీరో అని నొక్కుతావేంటి? నాకేంటి సంబంధం, అలా చేయడం నచ్చకపోతే వెంటనే చెంప మీద కొట్టమని చెప్పు అన్నాను. కానీ అలా కొట్టలేదు కదా అని కామన్ ఫ్రెండ్ నాతో అన్నాడు. అలాంటపుడు నాకెందుకు చెబుతున్నావు, వదిలేయ్ అన్నాను. ఇలాంటి గాసిప్స్ నాకు చెప్పొద్దు అని చెప్పాను…. అని మాధవి లత గుర్తు చేసుకున్నారు.

Madhavi Latha opens up on Sri Reddy Comments on Hero Nani Behaviourనిజ జీవితంలో రియల్ హీరోలు చాలా మంది ఉంటారు. వారు మన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మన పక్కింటోళ్లు అయుండొచ్చు. మనం హీరోలను స్క్రీన్ మీద చూసేని వీళ్లు తోపులు, తోపెస్ట్ లు అనుకుంటే కరెక్ట్ కాదు. ఒరిజినల్ బిహేవియర్ వేరేగా ఉంటుంది. స్క్రీన్ మీద కనిపించేది అంతా నటనే. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి… అని మాధవి లత అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here