2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన ‘మహానటి’ !

40

ఓవర్సీస్లో ‘మహానటి’ జోరు అలాగే కొనసాగుతోంది. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అన్ని లొకేషన్లలో దిగ్విజయంగా నడుస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు శుక్రవారం 59,000 డాలర్లను వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు 2 మిలియన్ డాలర్లను ఖాతాలో వేసుకుంది.

Mahanati has finally joined the club of $2 Million marks at USA box office

దీంతో అత్యధిక వసూళ్లను సాదించిన తెలుగు చిత్రాల జాబితాలో 11వ స్థానంలో నిలిచిందీ చిత్రం. ఇంకా 120 లొకేషన్లలో నడుస్తున్న ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేనాటికి భారీ మొత్తాన్ని చేజిక్కించుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించగా దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ గా కనిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here