మహేష్ 25 వ చిత్రం రిలీజ్ డేట్ ఎప్పుడో తెలిసిపోయింది!!!

142
Mahesh Babu 25th Movie Release Date is Out Now

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏప్రిల్ నెల లక్కీ నెల అనే విషయం అందరికి తెలుసు. ఏప్రిల్ మంత్ ఆయనకు లక్కీ మంత్ కవతకి కారణం ఆయన  2009 లో,  ఇండస్ట్రీ హిట్ చిత్రం, పోకిరి ఏప్రిల్ లో విడుదల అయ్యింది ఆ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ ఓ అందరికి తెలుసు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ లో, తన భారత్ అనే నేను కూడా ఏప్రిల్ లో నే విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకుంది…ముఖ్యంగా నటుడి గా మహేష్ బాబు కి ఆయన కెరీర్ అతిపెద్ద హిట్ గా ఈ చిత్రం నిలిచింది.

Mahesh Babu 25th Movie Release Date is Out Now

కాగా మళ్ళి భరత్ అనే నేను తో ఫాం లోకి వచ్చిన మహేష్ తను ల్యాండ్ మార్క్ చిత్రం 25 వ చిత్రాన్ని దర్శకుడు  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు అలాగే అశ్విని దత్ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని కూడా మహేష్ బాబు కి కలిసొచ్చిన ఏప్రిల్ లోనే రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు…షూటింగ్ మరియు అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకొని వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్ లో జరుగుతుంది. ఈ చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు అక్కడి అడవిలో జరుగుతున్నాయి. ఈ చిత్రం లో హీరోయిన్ గా  పూజా హెగ్డే నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here