సమ్మోహనం మూవీ చూసిన మహేష్ ఆశక్తికర ట్విట్

71
Mahesh babu tweets about sammohanam movie

సుధీర్‌బాబు, అదితిరావు హైదరీ జంటగా శ్రీదేవి మూవీస్ పతాకంఫై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సమ్మోహనం’. ఇటీవల విడుదలైన ఈ సిినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ చిత్రంపై సినీ ప్రముఖులు తమ స్పందనను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచే ఈ చిత్రంపై పాజిటివ్‌గా ఉన్న సూపర్ స్టార్ మహేష్‌బాబు వరుస ట్వీట్లతో తన స్పందనను వ్యక్తం చేశారు. “సమ్మోహనం చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చాలా అందంగా తీర్చిదిద్దారు. అద్భుతంగా డైరెక్ట్ చేశారు. మన పరిశ్రమలో అత్యద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఆయన ఒకరు. సమ్మోహనం గురించి మాటల్లో చెప్పలేను. సింప్లీ ఐ లవ్ ఇట్” అని ఓ ట్విట్‌లో మహేష్ పేర్కొన్నారు.

Mahesh babu tweets about sammohanam movie

“సుధీర్‌బాబు, అదితిరావు హైదరీ తమ కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. వారి కెరీర్‌లోనే ఉత్తమం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ నటులు నరేష్ గారు ఫెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆయన నటన బ్రిల్లియెంట్. మంచి సక్సెస్ సాధించిన చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్” అని మహేష్‌బాబు మరో ట్వీట్‌ చేశారు. “సమ్మోహనం చిత్రం గురించి పరిశ్రమ వర్గాల నుంచి మంచి రిపోర్టులు వస్తున్నాయి. మనోహరమైన సన్నివేశాలు, వీనులకు విందుగా ఉండే సంగీతం, కొత్త కాన్సెప్ట్, సుధీర్‌బాబు, అదితిరావు ఫెర్ఫార్మెన్స్ అదనపు ఆకర్షణ. చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్‌” అని మహేష్ మరో ట్వీట్ చేశారు. మహేష్ చేసిన ట్విట్‌కు హీరోయిన్ అదితిరావు తిరిగి బదులు ఇచ్చారు. “థ్యాంక్యూ థ్యాంక్యూ మహేష్‌బాబు. మీ నుంచి ఇలాంటి స్పందన రావడం థ్రిల్లింగ్‌గా ఉంది” అని మహేష్ ట్వీట్‌ను అదితి రీట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here