వంశీ పైడిపల్లి సినిమా కోసం మహేష్ మీసం గెడ్డం పెంచుతున్నాడంట

59

టాలీవుడ్ అందగాడు ఎవరంటే… తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువమంది మహేష్ బాబుకే ఓటేస్తారు. ట్రిమ్ చేసిన మీసం… గడ్డంతో రాజకుమారుడిలా మెరిసిపోతాడు ప్రిన్స్. ఇంతవరకెప్పుడూ మీసం పెంచడం గానీ… గడ్డం పెంచడం గానీ మహేష్ చేయలేదు. ‘భరత్ అనే నేను’ మూవీలో ఓ సీన్లో మీసంతో కొత్తగా కనిపించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేద్దామని గుబురు గడ్డంతో అర్జున్ రెడ్డిని తలపించే ట్రెండీ ఎలా ఉంటుందా… అని మహేష్ – వంశీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Mahesh Babu will be with beard and mustache look for next movie

షూటింగ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి మహేష్ పెంచిన గడ్డం లుక్ బాగోకపోతే మేకప్ లో అడ్జెస్ట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు- అశ్వినీదత్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here