హీరో నాగార్జున ఇంటి వద్ద యువతి రాదాంతం… రూ. 4 కోట్లు డిమాండ్…

55
Mentally retorted women hulchal at nagarjuna house in jublihills

టాలీవుడ్ ఫిల్మ్ హీరో రోడ్డు నంబరు 51లో ఉన్న నాగార్జున నివాసం ముందు ఒక యువతి గందరగోళం సృష్టించింది. మంగళవారం రాత్రి నివాసం వద్దకు వచ్చిన యువతి ఆయన తనకు రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఆయన్ను కలవడానికి లోనికి పంపాలంటూ హడావుడి చేసింది. నాగార్జున ఇంట్లో లేరని, తర్వాత రావాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా ఆమె వినిపించుకోకుండా రోడ్డు మీద పెద్ద హడావిడి చేసింది. ఈలోపు నాగార్జున పీఏను కలిసి సదరు యువతి నాగార్జున తనకు రూ. 4 కోట్లు ఇవ్వాలని అందుకే వచ్చినట్టు ఆమె చెప్పడంతో అంతా షాకయ్యారు.

Mentally retorted women hulchal at nagarjuna house in jublihills

పీఏ మరియు సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆదిలాబాద్‌కు చెందిన విజయ అనే మహిళగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఆమె మానసిక స్థితి బాగాలేదని నిర్దారణకు వచ్చిన తర్వాత బంధువులకు సమాచారం అందించారు. ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here