బిగ్ బాస్ 2 హోస్ట్ నాని గారు వచ్చేశారు

41

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ షో తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా నచ్చుతుంది అని ఎవరు ఊహించి ఉండరు. మొదటి షోకి అందిన రెస్పాన్స్ ఇతర ఇండస్ట్రీలో వారిని కూడా షాక్ కి గురి చేసింది. ఇక నెక్స్ట్ కూడా అంత కంటే ఎక్కువ రేంజ్ లో తెలుగు ప్రజలకు బిగ్ బాస్ కిక్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.

మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ తన బుజంపై బిగ్ బాస్ ను మోశాడు. ఇక ఆ బాధ్యతలను ఈ సీజన్ కు నాని తీసుకున్నాడు, ఈ ప్రయోగం పై అంచనాలు ఏ విధంగా పెరిగాయా స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే షో నిర్వాహకులు ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మంచి లుక్ ని రిలీజ్ చేశారు. గరం గరం చాయ్ ముందు పెట్టుకొని నాని స్టైల్ గా వంగి స్మైల్ తో ఇచ్చిన స్టిల్ సరికొత్తగా ఉంది.

ప్రస్తుతం ఆ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి నాని అనుకున్నంత రేంజ్ లో మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక ప్రస్తుతం షోలో కంటెస్టెంట్ లు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రోమోలు కూడా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here