ఈ సారి డైలాగ్ ఇంపాక్ట్ తో ఏప్రిల్ 8 న వస్తున్నానా పేరు సూర్య

56
Naa Peru Surya dialogue impact to be released on 8th April
Naa Peru Surya dialogue impact to be released on 8th April

దువ్వాడ జగన్నాధం మూవీ తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” ..అను ఎమ్మనుల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది ..బాలీవుడ్ సంగిత దర్శకులు విశాల్  శేఖర్ మొదటి సారి ఒక తెలుగు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు అది ఈ చిత్రం కావటం విశేషం ..ఇప్పటికే ఈ చిత్రం లోని రెండు పాటలు “సైనిక”, “lover also fighter” అనే ఈ రెండు పాటలు వివరితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. కాగా కిక్ , రేసు గుర్రం ,  టెంపర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఇంకా ఎన్నో హిట్ సినిమాలకు కధ అందించిన “వక్కంతం వంశీ” ఈ చిత్రం తో దర్శకుడి గా పరిచయం కాబోతున్నాడు.

మెగా బ్రదర్ నాగబాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ నిర్మాత ..అలాగే బన్నీ వాసు సహా నిర్మాత …ఈ చిత్రానికి సంబంధించిన ఒక టిసర్ ని ఈ మధ్యనే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ..అల్లు అర్జున్ పూర్తీ గా కొత్త లుక్ లో దేశ సైనికుడి పాత్ర పోషిస్తున్నాడు ..కాగా ఈ చిత్ర డైలాగ్ ఇంపాక్ట్ ఒక్కటి ఈ నెల 8 న రిలీజ్ చెయ్యబోతున్నారు…దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ని ఈ రోజు రిలీజ్ చేసారు…మే 4 న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

Naa Peru Surya dialogue impact to be released on 8th April

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here