నాగ్ – నాని ముల్టీస్టారర్ర్ కి రిలీజ్ డేట్ ఫిక్స్

34
Nagarjuna Nani Multistarrer Movie Release Date Announced

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున , నచూరల్ స్టార్ నాని కలిసి మొదటి సారి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం వినాయక చవితి కి రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మాతగా వైజయంతి బ్యానర్ ఫై నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే మహానటి తో సూపర్ హిట్ అందుకున్న వైజయంతి నిర్మాణ సంస్త ..ఇప్పుడు మరో హిట్ కొట్టాలి అని చూస్తుంది. భలే మంచి రోజు , శమంతకమణి లాంటి విబిన్న చిత్రాలు తీసిన శ్రీ రామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం లో నాగార్జున కు జంట గా మళ్ళి రావా ఫేం “ఆకాంక్ష సింగ్” నటిస్తుంది. అలాగే నాని కి జంట గా ఛలో ఫేం “రష్మిక మండన” నటిస్తుంది.

Nagarjuna Nani Multistarrer Movie Release Date Announced

మెలోడీ బ్రంహ మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వినాయక చవితి సెప్టెంబర్ 12 న రిలీజ్ కాబోతుంది. నాగార్జున నటించిన ఆజాద్ , ఆఖరి పోరాటం , రావోయ్ చందమామ ఈ మూడు చిత్రాలు వినాయక చవితికే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్నాయు. మళ్ళి ఇన్ని రోజులకు నాగార్జున నటించిన ఒక చిత్రం వినాయక చవితి కి రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం లో నాగార్జున “డాన్” గ కనిపించబోతున్నాడు..అలాగే నాని డాక్టర్ గా నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here