ఆఫీసర్ చిత్రం లోని మొదటి పాట విడుదల…

61
Nagarjuna Officer Movie Navve Nuvvu Video Song

రామ్ గోపాల్ వర్మ – నాగార్జున సూపర్ హిట్ కాంబినేషన్.. విరి కాంబినేషన్ లో “గోవిందా – గోవిందా” , “శివ” , “అంతం” లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి ..చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు వీళ్ళు చేస్తున్న చిత్రం “ఆఫీసర్” దీంతో ఈ చిత్రం ఫై అందరికి అంచనాలు భారి గా ఉన్నాయి. ఈ చిత్రాన్ని కంపనీ బ్యానర్ ఫై రామ్ గోపాల్ వర్మ , సుదీర్ చంద్ర లు కలిసి నిర్మించారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా కొత్త భామ మైరా శరన్ నటిస్తుంది.

మొదట ఈ చిత్రం మే 25 న రిలీజ్ చెయ్యాలి అని ప్లాన్ చేసిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తీ అవ్వక పోవటం తో జూన్ 1 కి వాయిదా వేసారు. రవి శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం లో మొదటి పాట ను ఈ రోజు రిలీజ్ చేసారు ఈ చిత్ర బృందం. నువ్వే నువ్వే అనే ఈ పాటను రమ్య బెహరా పాడింది. నాన్న , కూతురి మధ్య ప్రేమ ను చూపిస్తున్నట్లు ఈ సాంగ్ ఉంటుంది. ఈ పాట విడుదల అయిన వెంటనే ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ప్రతి ఒక్కరిని ఈ పాట ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here