సెన్సార్ పూర్తిచేసుకున్న ‘నేల టికెట్టు’ !

41
Nela Ticket Movie Censor Report | Ravi Teja | Malavika Sharma

మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో రవితేజ ‘నేల టికెట్టు’ అనే సినిమాతో త్వరలో మన ముందుకురాబోతున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా ఆడియో వేడుక నిర్వహించడం, ట్రైలర్, పాటలు కూడ ఇంప్రెస్ చేయడంతో ఈ సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుంది.

Nela Ticket Movie Censor Report | Ravi Teja | Malavika Sharma

ఈ మాస్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రంతో కొత్త హీరోయిన్ మాళవిక శర్మ కథానాయకిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయంకానుంది. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ ఈ చిత్రానికి సంగీతం అందివ్వగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న విడుదలకానున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here