రామ్ చరణ్-బోయపాటి మూవీ: ఫైట్ సీన్ కోసం రూ. 5 కోట్ల ఖర్చు

56
Ram Charan Boyapati movie spent 5 crores for action scenes

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన హైదరాబాద్‌లో ఓ భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. బోయపాటి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నింటిలోనూ భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఒక్కో సినిమాకు డోసు పెంచుతూ వచ్చాడు. అందులోనూ రామ్ చరణ్ సినిమా కావడంతో ఈ సారి భారీతనం మరింత పెంచాడు. ఈ సీన్ కోసం రూ. 5 కోట్ల ఖర్చుతో బోయపాటి ఈ భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారట.

Ram Charan Boyapati movie spent 5 crores for action scenes

ఈ సీన్లో ఏకంగా 500 మంది బాడీ బిల్డర్లు పాల్గొంటున్నారని, వీరితో పాటు 60 మంది నటులు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఆయన గత చిత్రం ‘జయ జానకి నాయక’లో హంసల దీవిలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి హైలెట్ అయింది. అయితే దాన్ని మించిపోయేలా ఇపుడు రామ్ చరణ్ మూవీలో భారీ ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్…. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here