‘రంగస్థలం’ 50 రోజుల వేడుకల్ని ఎంజాయ్ చేసిన మెగా పవర్ స్టార్ అభిమానులు

47
Ram Charan Fans Celebrate 50 Days of Rangasthalam

రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం ఆయన కేరీర్లోనే అతి పెద్ద విజయంగా నిలిచిన సంగతి తెలిసిందే. రూ.200 కోట్లకు పైగా గ్రా స్ను వసూలు చేసిన ఈ సినిమా నిన్నటితో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ మధ్యకాలంలో ఇంత బ్రహ్మాండమైన రీతిలో ప్రదర్శింపబడిన సినిమా రంగస్థలమేనని చెప్పొచ్చు.

Ram Charan Fans Celebrate 50 Days of Rangasthalam

రెండు తెలుగు రాష్ట్రల్లో కలుపుకుని సుమారు 80 కి పైగా కేంద్రాల్లో అర్థశతదినోత్సవాన్ని పూర్తి చేసుకోవడంతో మెగా అభిమానులు నిన్న రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వేడుకలను నిర్వహించారు. ‘రంగస్థలం’ ప్రదర్శింపబడుతున్న అనేక థియేటర్లలో సినిమాతో పాటు మెగా హీరోలందరి పాటలను ప్రదర్శిస్తూ ఆట పాటలతో ఎంజాయ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం రూ. 120 కోట్ల షేర్ తో అనేక ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డుల్ని సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here