రెండో భర్త విషయంలో… జాగ్రత్తగా అడుగులేసిన రేణు దేశాయ్

64
Renu Desai secretly got engagaed well known person

సినీ నటి రేణుదేశాయ్ పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత గత కొద్దికాలంగా ఒంటరిగా ఉంటున్నారు. అయితే ఇటీవల రెండో వివాహం కోసం నిశ్చితార్థం జరిగినట్టు స్వయంగా రేణు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ దంపతులకు అఖిరా, ఆద్య అనే ఇద్దరు సంతానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే రేణుదేశాయ్‌తో నిశ్చితార్థం జరిగిందనే విషయం సీక్రెట్‌గా ఉంచడంపై అభిమానుల్లో తీవ్ర చర్చకు కారణమైంది.

Renu Desai secretly got engagaed

ఆదివారం రేణుదేశాయ్ నిశ్చితార్థం జరిగింది. ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన వేడుకకు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నిశ్చిత్తార్థం జరిగిన ప్రదేశాన్ని కూడా చాలా సీక్రెట్‌గా ఉంచారు.
వరుడు ఎవరనే విషయాన్ని కూడా బయటకు పొక్కనివ్వలేదు. కానీ ముఖం పూర్తిగా కనిపించకుండా అతడు నవ్వుతున్న ఫోటోను రేణుదేశాయ్ షేర్ చేశారు. అయితే తన నిశ్చితార్థ వేడుకు సందర్భంగా తన పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. నా పిల్లలు లేకుండా నా జీవితంలో సంతోషం అసంపూర్తిగానే ఉంటుంది. నా కొత్త జీవితం ప్రారంభమయ్యే సమయంలో వారు నా పక్కనే ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అని రేణు దేశాయ్ ట్వీట్ చేశారు.

Renu Desai secretly got engagaed

రెండో పెళ్లి విషయంలో రేణుదేశాయ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పవన్ అభిమానుల నుంచి కొంత వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా జాగ్రత్త పడుతున్నారు. తన జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి గురించి త్వరలోనే రేణు దేశాయ్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు తన నిర్ణయానికి సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here