అకిరాకి నా పెళ్లి ఇష్టమే… తన పెళ్లిపై మరోసారి స్పందించింది రేణుదేశాయ్

133
Renudesai Revealed About Akira accepted Her Engagement

రేణుదేశాయ్ కొన్ని రోజుల కిందట ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. అయితే పెళ్లి ఎక్కడ, ఎవరితో, ఎప్పుడు అనే విషయాల్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. తను మీడియాకు దూరంగా, కొంతమంది సన్నిహితులకు దగ్గరగా పెళ్లి చేసుకుంటానని, పెళ్లి తర్వాత తన భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తానని మాత్రం క్లారిటీ ఇచ్చింది.

Renudesai Revealed About Akira accepted Her Engagement

“ఇనస్టాగ్రామ్ లో మొన్న నా ఎంగేజ్ మెంట్ కు సంబంధించి స్టోరీ పెట్టాను. నిజంగా అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ సమాధానం ఇవ్వాలంటే నెల రోజులు పడుతుంది. ఇలా తనకు మద్దతిచ్చేవాళ్లకు థ్యాంక్స్ చెప్పింది రేణుదేశాయ్. ఇక పిల్లల విషయానికొస్తే వాళ్లు అస్సలు ఫీల్ అవ్వడం లేదు. అకిరాకు అన్నీ తెలుసు. తను పెళ్లి చేసుకోవడం తన పిల్లలు అకిరా, ఆద్యకు కూడా ఇష్టమే అంటోంది రేణుదేశాయ్. వాళ్ల అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాతే పెళ్లికి సిద్ధమయ్యానని తెలిపింది. కొంతమంది ఉన్నారు పనీపాట లేనివాళ్లు. వాళ్లు మాత్రమే లేనిపోని కామెంట్స్ చేస్తున్నారు. 90 శాతం మంది నాపై ప్రేమ చూపిస్తున్నారు. నాకు మద్దతిస్తున్నారు. 10 శాతం మంది మాత్రమే సోషల్ మీడియాలో చెత్తగా ఉన్నారు.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here