ఆ విషయంలో చిరంజీవిని తరువాతే ఎవరైనా : రాజమౌళి

56
S. S. Rajamouli Extraordinary Speech @ #Vijetha Audio Launch Event

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘విజేత’. మాళవికా నాయర్ హీరోయిన్. ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌ సంగీతం అందించారు. ఆడియో వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ‌, రాజ‌మౌళి, సాయికొర్ర‌పాటి, క‌ల్యాణ్ దేవ్‌, అల్లు అర‌వింద్‌, ఎం.ఎం.కీర‌వాణి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌, సెంథిల్‌కుమార్ స‌హా ఇత‌ర‌ చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

S. S. Rajamouli Extraordinary Speech @ #Vijetha Audio Launch Event

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ…. చిరంజీవిగారు మంచి ఫైటర్, మంచి డాన్సర్, మంచి యాక్టర్ అని అందరికీ తెలుసు. ఆయనకు ఉన్న స్పెషల్ స్కిల్ స్టోరీ జడ్జ్ చేయడం, ఈ విషయం ఇండస్ట్రీ వారికి మాత్రమే తెలుసు. ఆయన స్టోరీ విన్న వెంటనే అందులో ఎలాంటి కరెక్షన్స్ చేయాలి, ఏం తప్పులు ఉన్నాయి, దేన్ని హైలెట్ చేయాలి, దేన్ని తగ్గించాలనేది చెబుతారు. ఈ విషయంలో ఆయన్ను మించిన జడ్జి లేరు అన్నారు. విజేత సినిమాకు కూడా చిరంజీవిగారు కథ విని చాలా బావుందని ఆయన ఓకే చెప్పడంతో అందరిలోనూ కాన్ఫిడెన్స్ వచ్చింని రాజమౌళి అన్నారు.

 

S. S. Rajamouli Extraordinary Speech @ #Vijetha Audio Launch Event

కథని క్వాలిటీగా ప్రజంట్ చేయాలి. క్వాలిటీ లేకుంటే ప్రజలకు రీచ్ అవ్వడం చాలా కష్టం. సాయి కొర్రపాటి ఏ సినిమా చేసినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. సినిమా బిగినింగులో కథ చెప్పినపుడు చిన్న కథ అని చెప్పారు. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని అర్థమైంది అని రాజమౌళి వెల్లడించారు. నేను సినిమాలో ఏమీ చూడలేదు. నాకు ఫస్ట్ వినిపించింది కోడి పాట. మా ఆవిడకు , అమ్మాయికి కూడా చాలా బాగా నచ్చేసింది. అపుడు ‘విజేత’ చిరంజీవికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో కళ్యాణ్ దేవ్ కు ఈ ‘విజేత’ అంత పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అన్ని విభాగాలు కంబైన్డ్ గా బాగా వర్క్ చేశారు…. అని రాజమౌళి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here