పవన్ కళ్యాణ్ గారు నాకు సినీ జీవితాన్ని ప్రసాదించారు.. అయన లేకపోతే నేను లేను

57

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం జూలై 6న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వైజాగ్ గుర‌జాడ క‌ళాక్షేత్రంలో ఈ చిత్ర ఆడియో స‌క్సెస్ మీట్ జ‌రిగింది.

Sai Dharam Tej Speech @ Tej I Love You Audio Success Meet

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ – “నేను వైజాగ్‌లోనే స‌త్యానంద్‌గారి వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్నాను. నాకు అప్పటి నుండి వైజాగ్‌తో మంచి అనుబంధం ఉంది. క‌రుణాక‌ర‌న్‌గారు ల‌వ్‌స్టోరీస్ తీయ‌డంలో సిద్ధ‌హ‌స్తులు. మా `తేజ్‌` సినిమాను కూడా చ‌క్క‌గా తీశారు. యూత్‌, కుటుంబ‌మంతా క‌లిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన నాకు ఈ చిత్రం ఓ ఇమేజ్ మేకోవ‌ర్ అవుతుంది. పెద్ద బ్యాన‌ర్ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ లో రామారావుగారు ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలు చేశారు. అనుప‌మ నేచుర‌ల్ పెర్ఫామ‌ర్‌. గోపీసుంద‌ర్‌గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా ముగ్గురు మావ‌య్య‌లు కార‌ణంగానే నేను ఈ స్టేజ్‌పై నిల‌బ‌డి ఉన్నాను. అలాగే మెగాభిమానులు చూపించే ప్రేమ‌ను మ‌ర‌చిపోలేను“ అన్నారు.
ముఖ్యంగా నాకు సినీ జీవితాన్ని ప్రసాదించింది పవన్ కల్యాణ్..అయన ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికి మర్చిపోలేను అని అన్నారు.

Sai Dharam Tej Speech @ Tej I Love You Audio Success Meet

జులై 6 న ఈ సినిమా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రొడ్యూసర్ రామారావుగారు. ఈ సినిమా ఆడియో ఇప్పటికే మంచి ఆదరణ పొందుతుంది. సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కి మరియు కరుణాకరన్ కి ఈ సినిమా సక్సెస్ ఎంతో ముఖ్యం. అల్ ది బెస్ట్ ‘తేజ్‌’. ఐ లవ్‌ యు టీం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here