ఆ వాఖ్యల్లో నిజం లేదు, ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం : శేఖర్ కమ్ముల

50
Sekhar Kammula Serious on Actress Sri Reddy Comments
Sekhar Kammula Serious on Actress Sri Reddy Comments

ఈ మధ్య కాలం లో హీరోలు , దర్శకులు , నిర్మాతల ఫై సంచలన వాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి ….నిన్న తన సామజిక మాధ్యమాలలో ఒక పోస్ట్ పెట్టింది. పెద్ద డైరెక్టర్ అని పొగరు .. వీడియో కాల్ కోసం ఏమైనా చేస్తాడు … అతనెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖరుడు అంటూ “శేఖర్ కమ్ముల” ఫై సంచలన పోస్ట్ పెట్టింది … దిని ఫై శేఖర్ కమ్ముల స్పందిస్తూ … నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది.

Sekhar Kammula Serious on Actress Sri Reddy Comments

ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది.నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం.

Sekhar Kammula Serious on Actress Sri Reddy Comments

స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను” అని అన్నారు.ఇంకా ఈ వాఖ్యలు ఎక్కడికి పోతాయో చూడాలి … మరి ఈ వాఖ్యలకు శ్రీ రెడ్డి స్పందిస్తుందో ? లేదో ?…

Sekhar Kammula Serious on Actress Sri Reddy Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here