శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా లో అన్నదమ్ములు గా ఆ యంగ్ హీరోలు క్రేజీ కాంబినేషన్!!!

32
Sharwanand next movie with Brahmotsavam director Srikanth Addala

తెలుగు లో చాలా ఏళ్ల తరువాత మల్టీ స్టారర్ ని తీసుకొచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల . ఆయన మొదటి సినిమా నే ఇద్దరు పెద్ద హీరోలు వెంకటేష్ , మహేష్ బాబు తో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అనే సూపర్ హిట్ చిత్రాన్ని చేసాడు. ఆ మూవీ తరువాత మెగా హీరో వరుణ్ తేజ్ ని పరిచయం చేస్తూ “ముకుంద” అనే చిత్రాన్ని చేసాడు.. ఆ సినిమా అంతగా ఆడలేదు. దీంతో ఆయనకి మహేష్ బాబు ఆఫర్ ఇచ్చాడు. మహేష్ బాబు తో శ్రీకాంత అడ్డాల “బ్రహ్మోత్సవం” అనే మూవీ చేసాడు . ఈ చిత్రం మహేష్ బాబు కెరిర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్.

Sharwanand next movie with Brahmotsavam director Srikanth Addala

ఈ ఒక్క మూవీ తో శ్రీకాంత్ అడ్డాల కి ఒక్క ఆఫర్ అంటే ఒక్క ఆఫర్ కూడా రాలేదు. దాదాపు అయన రెండు ఏళ్ళు ఏ సినిమా కూడా చెయ్యలేదు. దీంతో ఈ మధ్య కాలంలో యంగ్ హీరో శర్వానంద్ కి ఒక మంచి ఫ్యామిలీ స్టొరీ చెప్పగా “ఒకే” చెప్పాడు శర్వా. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ ఫై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. అన్నదమ్ముల నేపద్యం లో జరిగే కధ కావటం తో ఇందులో మరో హీరో అవసరం. ఈ బ్రదర్ పాత్ర కోసం యంగ్ హీరో ఈ మధ్య కాలంలో మంచి చిత్రాలు చేస్తున్న శ్రీ విష్ణు ని తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here