యాంకర్ ఝాన్నీ భర్త ఎవరో తెలుసా? ఆయనతో ఎందుకు విడిపోయిందో తెలుసా?!!

70
Shocking Reasons Behind The Anchor Jhansi- Jogi Naidu Divorce

తెలుగు టీవీ చానెల్స్ లో బాగా చలాకీగా యాంకరింగ్ చేయడంలో ఝాన్నీ స్టైలే వేరు.. ఇప్పటికీ పలు చానెల్స్ లో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అయితే పదేళ్ల కింద జెమినీ టీవీలో వచ్చిన ఒక ప్రోగ్రాంలో ఝాన్సీ రోజుకో భిన్న గెటప్ తో సినిమాలపై విశ్లేషణలు చేసింది. ఝాన్నీ లైఫ్ ను మలుపు తిప్పిన ఆ కార్యక్రమానికి ఇప్పుడు కమెడియన్ గా పేరు తెచ్చుకున్న జోగినాయుడు ప్రోగ్రాం డైరెక్టర్ గా చేసేవాడు. ఇలా ఝాన్సీ, జోగినాయుడు మధ్య పరిచయం, ప్రేమగా మారి వీరిద్దరి పెళ్లి వరకూ దారి తీసింది.

Shocking Reasons Behind The Anchor Jhansi- Jogi Naidu Divorce

అయితే పెళ్లి అయ్యాకే ఝాన్నీ కి భర్త ప్రవర్తన, అతడి పద్ధతి నచ్చక అతడి నుంచి విడిపోయింది. అతడు మాత్రం తన భార్య మంచిది కాదంటూ ఇండస్ట్రీలో ప్రచారం చేయడం, టీవీ ప్రోగ్రాం అవకాశాలు కూడా రాకుండా చేశాడని విమర్శలున్నాయి. ఝాన్నీ కోర్టుకు వెళ్లి జోగినాయుడు నుంచి విడాకులు తీసుకోవడానికి పిటీషన్ వేసింది. దాదాపు సంవత్సరం తర్వాత కష్టపడి విడాకులు సాధించింది. ఝాన్నీ పడ్డ కష్టం మామూలుది కాదని.. ఆమె సన్నిహితులు కూడా అంటూ ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఝాన్నీ పెద్దగా ఆస్తులు కూడా సంపాదించలేదట.. ఆమెకు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ ఆమెకు దగ్గరగా ఉండే వారు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here