శ్రద్ధా కపూర్‌ తన పెద్ద మనస్సు మరోసారి చాటుకుంది

35

బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు శ్రద్ధా కపూర్‌. ఆశిక్ మూవీ తో ఒకే సారి టాప్ హీరోయిన్ గా మారింది. కాగా ఆమె ఈ మధ్య తన పెద్ద మనస్సు చాటుకుంది. తను తెర మీద, తెర వెనుక ఉపయోగించిన డ్రెస్సులను సామాజిక కార్యక్రమాల కోసం వినియోగించాలని భావిస్తోంది. జంతు సంరక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థలకు తన దుస్తులను వేలం వేయటం ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది.

Shraddha Kapoor donates her clothes for a noble cause

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘సాయం చేయడానికి అధికారం ఉండాల్సిన అవసరం లేదు, సెలబ్రిటీ అయ్యుండాల్సిన అవసరం లేదు. ప్రతీ ఒక్కరు ఎంతో కొంత తిరిగిచ్చేయాలి. మనకు అన్ని రకాల వసతులు, ప్రేమించే మనుషులు ఉన్నారు. ఆ ప్రేమను మనం కూడా ఇతరులకు పంచాలి’ అని చెప్పింది. ప్రస్తుతం పలు సినిమాలలో హీరోగా నటిస్తున్న ఆమె మొదటి సారి తెలుగు లో ప్రభాస్ ‘సాహో’ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కాబోతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here