జూ ఎన్టీఆర్‌తో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి

181

జయమ్ము నిశ్చయంబు రా, ఆనందో బ్రహ్మ చిత్రాలు సాధించిన విజయాల తర్వాత హీరోగా ప్రస్తుతం జంబలకిడి పంబలో నటిస్తున్నాను. గత చిత్రాల్లో కథ నచ్చడంతోనే హీరోగా చేశాను. ఈ సినిమాలో కూడా దర్శకుడు చెప్పిన స్టోరి కారణంగానే ఈ చిత్రంలో నటించాను. ఇంట్లో నైటీలు వేసుకొని మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాను. మన ఇంట్లోకి కొత్త వ్యక్తి వచ్చారంటూ నా కూతురు కూడా చాలా గమ్మత్తుగా కామెంట్ చేసింది. ఆడ వేషంలో నటించడం కొత్త అనుభూతి. ఈ చిత్రంలో మహిళ పాత్రలో నటించడం ద్వారా వారిపై మరింత గౌరవం పెరిగింది.

Srinivas Readdy gives clarity on issue with Jr Ntr

ఎన్టీఆర్‌తో విభేదాలు అంటూ మీడియాలో వార్తలు చూసినప్పుడు బాధ కలుగుతుంది. అందుకే మా మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో చెప్పడానికి షూటింగ్‌లో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టాను. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ముఖ్యంగా ఎన్టీఆర్‌‌కు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను ఏదో అన్నారనే విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేను వెల్లడించాను. కానీ ఎన్టీఆర్ అలాంటి విషయాలు పట్టించుకోరు చాలా పరిణతి ఉన్న వ్యక్తి.

Srinivas Readdy gives clarity on issue with Jr Ntr

కమెడియన్ గా ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత, శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న అమర్ అక్బర్ ఆంథోని, వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్2, నారా రోహిత్ రూపొందించే వీరభోగ వసంత రాయలు, పంతం చిత్రాల్లో నటిస్తున్నాను. కోన వెంకట్ ఓ సినిమా చేద్దామని అన్నారు. గీతాంజలి2 సినిమా గురించి క్లారిటీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here