బిగ్ బాస్‌ 2 లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పిన తమ్మారెడ్డి…

177
Tammareddy Bharadwaj About Bigg Boss Telugu 2 Winner & Tollywood Rumors

బిగ్ బాస్ 2 షో వారాలు గడిచేకొద్దీ రసవత్తరంగా మారుతోంది. విజేత ఎవరు అనే ఆసక్తి కూడా ఆడియన్స్ లో నెలకొని ఉంది. సినీ రాజకీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడే దర్శక నిర్మాత తమ్మారెడ్డి బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ సారి విజేత ఎవరో తమ్మారెడ్డి జోస్యం చెప్పారు. ఈ సారి బిగ్ బాస్ లో కొన్ని విభాగాలలో పాపులర్ మరియు ఎక్కువగా వివాదాలలో నిలిచిన వారిని బిగ్ బాస్ షో కు ఎంపిక చేసుకున్నారని తమ్మారెడ్డి తెలిపారు.

Tammareddy Bharadwaj About Bigg Boss Telugu 2 Winner & Tollywood Rumors

కొంతమంది ఆరు నెలల నుంచి బిగ్ బాస్ షోలో ఎంపికయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వివాదాలని క్రియేట్ చేసుకుని కూడా హైలైట్ అవ్వాలని చూసారు. కానీ వారు ఎంపిక కాలేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.సింగింగ్ లో పాపులర్ అయిన గీతా మాధురి, టివి చర్చలతో గుర్తింపు పొందిన బాబు గోగినేని వంటి వారిని ఎంపిక చేసుకున్నారు.

Tammareddy Bharadwaj About Bigg Boss Telugu 2 Winner & Tollywood Rumors

బిగ్ బాస్ 2 లో విన్నర్ గా ప్రస్తుతం ప్రధానంగా ముగ్గురు ఆకర్షణగా నిలుస్తున్నారని, ఈ బిగ్ బాస్ లో గీతా మాధురి, బాబు గోగినేని, తేజస్వి లలో ఒకరే విన్నర్ గా నిలుస్తారని తమ్మారెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు. బాబు గోగినేని లాజిక్ లు బాగా మాట్లాడతారు. గీతా మాధురి పాటలు బాగా పడుతుంది.. ఇక తేజస్వి యాక్టింగ్ బాగా చేస్తోందని పరోక్షంగా తమ్మారెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here