దాసరి భౌతికంగా దూరం అయ్యి నేటితో ఏడాది అయ్యింది

40
Dasari Narayana Rao వర్ధంతి

దర్శకనిర్మాతగా తెలుగు సినీలోకంలో విశేష ప్రజాదరణ పొందిన వ్యక్తి దర్శకరత్న ‘దాసరి నారాయణరావు’. ఆయన ఈ లోకాన్ని విడిచి నేటికి ఏడాది పూర్తైంది. ఈ సమయంలో ఆయన గురించి ప్రతీఒక్కరూ తలచుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ పెద్దదిక్కుగా నిలిచిన ఆయన లేను లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ ఆయనను తలచుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన లేని లోటును ఇప్పటికే పలుమార్లు స్మరించుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని అందరు ‘గురువుగారు..’ అని పిలుచుకునే ఆయన వర్థంతినాడు ఆయనను స్మరించుకుంటున్నారు.

Tollywood director Dasari Narayana Rao’s 1st death  Anniversary

గత ఏడాది మే 30వ తేదీన దాసరి నారాయణ రావు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆయన మరణించడంతో చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా దాసరి రూపొందించిన సినిమాలను గుర్తు చేసుకుని ప్రేక్షకులు కూడా దాసరి ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. ఇటీవలకాలంలో తెలుగు చిత్రసీమలో చోటుచేసుకున్న పరిణామాలు కాస్త ఆందోళనకు గురిచేసినపుడు కూడా ఆయనను అందరూ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేదు. భర్తీ చేయగల వ్యక్తులు కూడా ఇండస్ట్రీలో లేరిని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here