ఎప్పటికైనా ఎన్టీఆర్ తో సినిమా చేస్తా : వక్కంతం వంశీ

50
Vakkantham Vamsi opens up about NTR's project

స్టార్ రైటర్ వక్కంతం వంశీ రైటర్ నుంచి డైరెక్టర్ గా ఈ మధ్యనే టర్న్ అయిన విషయం తెలిసిందే ….అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రాన్ని చేసి మంచి విజయం అందుకున్నాడు…అసలు అయితే వక్కంతం వంశీ తన మొదటి సినిమాగా ఎన్టీఆర్ హీరో గా చెయ్యాలి అని ప్లాన్ చేసిన అది కుదరలేదు…దీంతో అల్లు అర్జున్ తో “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” మూవీ చేసాడు వంశీ….ఈ విషయం ఫై స్పందించిన వంశీ, ఎన్టీఆర్ తో నాకు మూవీ చెయ్యాలి అని ఎప్పటి నుంచో ఉంది…మొదట చేద్దాం అనుకున్న విషయం వాస్తవమే కానీ నేను అనుకున్న స్టొరీ లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది.

Vakkantham Vamsi opens up about NTR's project

అందువల్ల ఆ స్టొరీ పక్కన పెట్టాను అని అన్నారు…అలాగే ఎన్టీఆర్ నాకు ఎంతో ఇష్టమైన నటుడు అని తెలిపారు..నా దర్శకత్వం లో ఎప్పటికైనా ఖచ్చితంగా ఎన్టీఆర్ తో సినిమా చేస్తా అని వక్కంతం వంశీ తెలిపారు….అలాగే వంశీ ఆయన తదుపరి చిత్రాల గురించి తెలిపాడు…ఇంకో మూడు నుంచి నాలుగు సినిమాలు తన చేతి లో ఉన్నట్లు తెలిపారు…అలాగే ప్రస్తుతం దర్శకత్వనికి ఎక్కువ ప్రాదాన్యత చూపిస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here