ఎన్టీఆర్ బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాబాలన్…

41
Vidya Balan Finally Signs NTR Biopic officially

బయోపిక్ తెరకెక్కించాలంటే అనేక ఛాలెంజ్ లతో కూడుకున్నది. కథను సిద్ధం చేయడం ఒక ఎత్తైతే.. అందులో నిజమైన మనుషులకు తగ్గట్టు నటి నటులను సెలెక్ట్ చేయడం ఒక ఎత్తు. నాగ్ అశ్విన్ మహానటి సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో తెలిసింది. అయితే అంత కంటే పెద్ద క్యాస్ట్ తో కూడుకున్న ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్. ఈ సినిమాలో అత్యంత కాంట్రవర్షియల్ తో కూడుకున్న పాత్రలకు క్యాస్టింగ్ చేయాలంటే కత్తి మీద సాములాంటిది.

Vidya Balan Finally Signs NTR Biopic

చాలా మంది ఇప్పటికే బాలకృష్ణ అడిగినప్పటికీ బయోపిక్ కి నో చెప్పారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం గతంలో విద్యా బాలన్ ని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె నో చెప్పారని కూడా టాక్ వచ్చింది. ఇక ఫైనల్ గా ఆమె ఇటీవల ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించనున్న సంగతి తెలిసిందే. ఇక దర్శకుడు తేజ తప్పుకున్న తరువాత బాలయ్య కోరడంతో క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. జూన్ మూడవ వారంలో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ బాలయ్య డిసైడ్ అయ్యారు. ఇక విద్యా బాలన్ జులై లో స్టార్ట్ కాబోయే షెడ్యూల్ లో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here